స్వంతత్ర రాజ్యం ప్రభురాజ్యం స్వామి

svantatra raajyan prabhuraajyan svaami

🎵 AKK-512💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

స్వంతత్ర రాజ్యం ప్రభురాజ్యం స్వామి యేసు ఘన సామ్రాజ్యం స్వకీయ రాజ్యంమన రాజ్యం సమాధానముగల రాజ్యం ||స్వంతత్ర రాజ్యం||

1వ చరణం

ఆద్యంతము లేనిది యీ రాజ్యం అక్షయ విమల సదా సుఖరాజ్యం చోద్యము వచింప సుందర రాజ్యం సురుచిర నీతియు గల రాజ్యం ||స్వంతత్ర రాజ్యం||

2వ చరణం

మన దేవుని సహవాసము కలుగున్ మరణ దుఃఖ బాధలు మరి తొలుగున్ యేసులేని కాంతియై ప్రభు వెలుగున్ కనలేమిక చీకటి తొలుగున్ ||స్వంతత్ర రాజ్యం||

3వ చరణం

సూర్చు నెండవడ గాలియు నైనన్ సోకదు తన ప్రజలకు నింతైనన్ ఆర్యసహాయం బాకలియైనన్ అటనుండవు దాహములైనన్ ||స్వంతత్ర రాజ్యం||

4వ చరణం

నీతిమంతులట నూతన గీతం ప్రీతిగ పాడుచు ప్రభుని సమేతం దూతల బోలి వసింతురు నిరతం జ్యోతులవలె వెలుగుదురు సతం ||స్వంతత్ర రాజ్యం||

5వ చరణం

జీవ వృక్ష ఫలముల దినిపించున్ జీవ జలంబుల మరి ద్రావించున్ దేవుడె మన కన్నీటిని దుడుచున్ దేవతలందరి పయినుంచున్ ||స్వంతత్ర రాజ్యం||

Report Error