యేసుక్రీస్తుని దాసులారా మీ సుతులకును
yeesukreestuni daasulaaraa mee sutulakunu
పల్లవి
యేసుక్రీస్తుని దాసులారా మీ సుతులకును నేర్పరె ఆశతో యెహోవ యాజ్ఞల నభ్యసింపగ జేయరే ||యేసుక్రీస్తుని దాసులారా||
1వ చరణం
పిల్లలెప్పుడు ననుసరింతురు తల్లిదండ్రుల నడతలన్ ఎల్ల విషయము లందు మాదిరి పిల్లలకు గనుపర్చరే ||యేసుక్రీస్తుని దాసులారా||
2వ చరణం
మోదమిచ్చు కుటుంబ ప్రార్థన నేదినంబును మానక ఆదివారపు బడికి బిడ్డల నాదరముతో బంపరే ||యేసుక్రీస్తుని దాసులారా||
3వ చరణం
యేసునాధుని బోలు నాయకు డే జగంబున లేడని యేసు కే నిజ శిష్యులగుటకు నేర్పరే యౌవనులకు ||యేసుక్రీస్తుని దాసులారా||
4వ చరణం
యేసు శౌశీల్యమును వారికి బోధింపరే పసితనమునె వారి హృదయము యేసురూపము దాల్చును ||యేసుక్రీస్తుని దాసులారా||
5వ చరణం
యేసుక్రీస్తులొ నిలిచి వారలు యేపుమీర ఫలింపగా యేసు వాక్యము వారి యెదలలో నాశతోడను నాటరే ||యేసుక్రీస్తుని దాసులారా||