యేసుతో ఠీవిగాను పోదమా! అడ్డుగా
yeesutoo theevigaanu poodamaa! addugaa
పల్లవి
యేసుతో ఠీవిగాను పోదమా! అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో బోదము ||యేసుతో ఠీవిగాను||
1వ చరణం
రారాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవచేయను యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో ఠీవిగాను||
2వ చరణం
విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచు అనుదినంబు శక్తిని బొందుచున్నవారమై యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో ఠీవిగాను||
3వ చరణం
శోధనలు మనల చుట్టివచ్చినా సాతాను అంబులెన్ని తగిలినా భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో ఠీవిగాను||
4వ చరణం
ఓ యువతి యువకులారా చేరుడి శ్రీ యేసురాజు వార్త చాటుడి లోకమంత యేకమై యేసునాధు గొల్వను సాధనంబెవరు నీవు నేనెగా ||యేసుతో ఠీవిగాను||