ఓ క్రైస్తవ యువకా నిజమంతయు
oo kraistava yuvakaa nijamantayu
పల్లవి
ఓ క్రైస్తవ యువకా నిజమంతయు గనుమా నీ బ్రతుకంత మారుటె మేలు కోరుము జీవమునే ||ఓ క్రైస్తవ||
1వ చరణం
పాపపు చీకటి బ్రతుకేలా శాపపు భారము నీకేలా పావన ప్రభుని పాదము జేరిన జీవము నీకగుగా ||ఓ క్రైస్తవ||
2వ చరణం
భయపడి వెనుకకు పరుగిడక బలమగు వైరిని గెలిచెదవా బలుడగు ప్రభుని వాక్యము నమ్మిన గెలుపే నీదగుగా ||ఓ క్రైస్తవ||
3వ చరణం
మారిన జీవిత తీరులలో మానుగ నీ ప్రభుసేవకురా మహిమ కిరీటం మన ప్రభు సేవలో ఘనముగ నీకగుగా ||ఓ క్రైస్తవ||