ఓ క్రీస్తు భక్తులారా నీతి

oo kreestu bhaktulaaraa neeti

🎵 AKK-530💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఓ క్రీస్తు భక్తులారా నీతి నిమిత్తము పోరాడ కవచంబు ను ధరించుడి శక్తుండు సైన్య ప్రభు వు, శాంతిరాజుకు అపారసేవ జేయ అర్పణ యైతిమి. ||ఓ క్రీస్తు||

1వ చరణం

పదండి ముందుకంచు నాదంబు చేయుడు స్వార్థంబు గెల్వవలె సాగిపోదము హర్షంబులేని యాత్మ లెన్నెన్నొ చూడుడు ఈ ఘోరయుద్ధమున కందరి గూర్చుడు.

2వ చరణం

క్రీస్తే మా నాయకుండు అటంచు దెల్పగ మా హృదయంబునందు సంతోష శాంతిసేద లు కల్గునప్పుడు సిల్వధ్వజము! ఈ లోకమేలులన్ని దీవెన నొందును.

Report Error