రేగత్వరపడకు ఓర్చుకో కోపి గోడుజెందును
reegatvarapadaku oorchukoo koopi goodujendunu
పల్లవి
రేగత్వరపడకు ఓర్చుకో కోపి గోడుజెందును ఓర్చుకో నీ కన్యాయమయినను కన్ను లెర్రజేయకు శాంత మొందు మెప్పుడు ఓర్చుకో.
1వ చరణం
ఎవ్వఁడేని తిట్టిన ఓర్చుకో మేలుఁజేయు కీడుకు ఓర్చుకో లోకమందు సుఖము కొంతసేపు నుండును కోపమేలఁ జేతువు? ఓర్చుకో.
2వ చరణం
నీవు కీడునొందఁగా ఓర్చుకో ప్రతి కీడుఁ జేయకు ఓర్చుకొనియుండుము అంత సరియగును నీకు జయముండును ఓర్చుకో.