చేతులెత్తి వందనములు చేతు మిపుడే

cheetuletti vandanamulu cheetu mipudee

🎵 AKK-532💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

చేతులెత్తి వందనములు చేతు మిపుడే యేసు నీకు రాతిరి పగ లందు మముఁ బ్రీతితోఁ గాపాడు యేసు ||చేతులెత్తి వందనములు||

1వ చరణం

సుఖమైనట్టి నిద్ర మమ్ము నొందఁజేసి రాత్రియందు సకల మేలు లంద జేయు స్వామి యేసుక్రీస్తూ నీకుఁ ||చేతులెత్తి వందనములు||

2వ చరణం

అన్నవస్త్రములను మాకు నన్ని వేళలందు నిచ్చి కన్న తండ్రివలెను బెంచు చున్న యేసుస్వామీ నీకే ||చేతులెత్తి వందనములు||

3వ చరణం

విద్యా బుద్ధులన్ని యిచ్చి వింత వింత వరము లిచ్చి పెద్దల దయలోనుమమ్ముఁ బెంపారఁ జేయు మేసయ్యా ||చేతులెత్తి వందనములు||

4వ చరణం

చిన్నవారి స్నేహితుడుగ నున్న యేసుస్వామీ నీకు ఎన్నో వేల స్తోత్రంబులు నిలలో నెపుడు కలుగుగాక ||చేతులెత్తి వందనములు||

Report Error