బాలకుల విన్నపము లాలించు రక్షకా

baalakula vinnapamu laalinchu rakshakaa

🎵 AKK-535💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

బాలకుల విన్నపము లాలించు రక్షకా పాలనంబు సేయుమా పరమ పోషకా ||బాలకుల విన్నపము||

1వ చరణం

బాలలారా రండియంచు బిలిచిన యేసూ చాలనమ్మి జేరితిమి సరగ బ్రోవుమా ||బాలకుల విన్నపము||

2వ చరణం

మందబుద్ధి చేత నిన్ను మరచి యుంటిమి సుందరాప్త నీదయ మా యందు జూపుమా ||బాలకుల విన్నపము||

3వ చరణం

చదువు వేదవాక్య సరణి నడువ నేర్పుమీ మదిని బోధకుల సుబోధ మరువనీకుమీ ||బాలకుల విన్నపము||

4వ చరణం

ప్రకటితమగు నీదు ప్రేమ యనుభవించుచు ఇకను నిన్ను సేవ జేతు మఖిలకాలము ||బాలకుల విన్నపము||

5వ చరణం

పుడమి నీదు సిలువ కృపను పుణ్యలగుచును కడను నీదు మహిమ జేర గరుణజూపుము ||బాలకుల విన్నపము||

Report Error