అనుకరించెద నే ననుదినమును బాలుఁ

anukarincheda nee nanudinamunu baalun

🎵 AKK-543💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

అనుకరించెద నే ననుదినమును బాలుఁ డేసు ననువుగాను జ్ఞానమునం దును వయస్సునందును దే వుని ప్రేమను మానవుల ద యను బెరిగిన బాలుఁడేసు ||అనుకరించెద నే||

1వ చరణం

పరదేశంబున వసించి పరమాత్తుని మదిఁ దలంచి దురితమును జయించిన స చ్చరితుఁడైన యోసేపు ||అనుకరించెద నే||

2వ చరణం

తల్లి యానతి నెరవేర్చి తమ్ముని కష్టములఁ దీర్చి యెల్లకాలముండు కీర్తి నిల గడించిన మిర్యాము ||అనుకరించెద నే||

3వ చరణం

పాలు మరచినది మొదలు ప్రభు సేవా సంపదలు ఆలయమునఁ బూసిన సు బాలకుండు సమూయేలు ||అనుకరించెద నే||

4వ చరణం

శత్రువులను బరిమార్చి మిత్రులకు జయంబొనర్చి స్తోత్రగీతములు రచించిన సుందరుండౌ దావీదు ||అనుకరించెద నే||

5వ చరణం

పరులకు న్యాయంబుఁ దీర్పఁ బ్రజలకు క్షేమంబుఁ గూర్పఁ పరమ వివేకంబుఁ గోరి ప్రభు నడిగిన సొలొమోను ||అనుకరించెద నే||

6వ చరణం

యజమానుని కుష్ఠుఁ గాంచి స్వజనుల దేవుని గురించి నిజ సాక్ష్య మిడి సన్మా నించిన హెబ్రీయ బాల ||అనుకరించెద నే||

7వ చరణం

అపవిత్ర రాజ భోజ నాదుల విడి దైవ పూజఁ గపట మింత లేక చేసి ఘనత నొందిన దానియేలు ||అనుకరించెద నే||

8వ చరణం

ప్రార్థన కూటమునఁ జేరి ప్రత్యుత్తర మపుడె కోరి సార్ధకముగఁ బేతురుని సమాచార మిడిన రొదే ||అనుకరించెద నే||

9వ చరణం

భక్తిభయములందుఁ బెరిగి బహు ప్రేదేశములను దిరిగి శక్తి కొలఁది సంఘ పరి చర్య నొనర్చిన తిమోతి ||అనుకరించెద నే||

Report Error