తండ్రి వంటివాఁడు మనకు ధరణిని

tandri vantivaandu manaku dharanini

🎵 AKK-544💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

తండ్రి వంటివాఁడు మనకు ధరణిని బోషించువాఁడు దండ్రి ప్రియుఁ డు నందరికిఁ దగినవాని నొసగువాఁడు ||తండ్రి వంటివాఁడు||

1వ చరణం

అన్నవస్త్రములనే గాక యన్నిఁటిని నిచ్చువాడు మన్ననతోఁ బ్రోచు వాడు మనతో నెప్పుడు మెలఁగువాఁడు ||తండ్రి వంటివాఁడు||

2వ చరణం

కష్టబాధలందు మనలఁ గనికరముతోఁ గాచువాఁడు దుష్టమనసు తీసివేసి యిష్టముతో నుండువాఁడు ||తండ్రి వంటివాఁడు||

Report Error