యేసుబోలి మంచిబుద్ధి యెంతో ప్రేమగలిగినే

yeesubooli manchibuddhi yentoo preemagaliginee

🎵 AKK-547💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసుబోలి మంచిబుద్ధి యెంతో ప్రేమగలిగినే నేను గోరినట్టి పనుల నెపుడు చేయగోరుదున్ దయయు శాంతమమరినట్టి తనదు నడత దలచుకొనుచు ||యేసుబోలి మంచిబుద్ధి||

1వ చరణం

యేసు చిన్నబాలుడై యీ ధరను దిరిగినప్పుడు ఎల్లరతని మంచి గుణము లెంచి ప్రేమ జూపిరి దయయు, శాంతమమరినట్టి తనదు నడత దలచుకొనుచు ||యేసుబోలి మంచిబుద్ధి||

2వ చరణం

పిట్టలందు పూవులందు ప్రీతిజూపె నేసుడు అల్పజీవులైన, తండ్రి యన్నిజేసెనంచును దయయు, శాంతమమరినట్టి తనదు నడత దలచుకొనుచు ||యేసుబోలి మంచిబుద్ధి||

Report Error