పల్లవి
ఏ దేశస్థులమైన ఏ జాతి మనదైన యేసులో మన మొక్కటే ఏకమై బాలల మెల్లరమును తండ్రి నెంతో స్తుతించుచు నెప్పుడు బాడుదము ||ఏ దేశస్థులమైన||
1వ చరణం
పలు దేశములలోన పన్నుగ దేవుని ప్రార్ధించెడి బాలలం పరమ తండ్రీ మాలో ప్రతివారి దీవించు బహుగా నీ దినమనుచు బ్రతిమాలి వేడుదము ||ఏ దేశస్థులమైన||
2వ చరణం
బహు దేశములలోన పలువిధుములగు పనులు పరగజేసెడి బాలలం ప్రభుడే యేసుని కొఱకే ప్రపంచమంతటిని బాగుచేయను మిగుల ప్రయాసపడుదము ||ఏ దేశస్థులమైన||