మంగళము క్రీస్తునకు మహిత శుభవార్తునకు
mangalamu kreestunaku mahita shubhavaartunaku
మంగళము క్రీస్తునకు మహిత శుభవార్తునకు మంగళము త్రిత్వస మాన్వితునకు మంగళము దూత జన మకుట మగు ప్రభువునకు మంగళము వేదాంత మాన్యునకును జయ మంగళము సదా శుభ మంగళము ||మంగళము క్రీస్తునకు||
కానాకుఁ జనుదెంచి కల్యాణమును మహిమ గా నొనరప్పను నీరు గాంచి ద్రాక్షా పానముగ మార్చి నీ ప్రథమాద్భుత ప్రతిష్ఠ భూనుతుఁడ తెల్పితివి మానితముగా ||మంగళము క్రీస్తునకు||
నీకు సంఘమునకు నిత్యమైన వివా హైకత్వమునకుఁ దగు నెచ్చరికగాఁ గైకొనెడి నీ సేవక వరుల పరిణయము నీ కరుణచే ధరను నిముడుగాక ||మంగళము క్రీస్తునకు||
ప్రేమానుబంధమునఁ బెనగి యీ దంపతులు వేమారు నీ మహిమ వెదకి భువిని కామాదులను గెల్చి కైవల్య పురమునకు క్షేమ మగు కృపనిచ్చి చేరనిమ్ము ||మంగళము క్రీస్తునకు||
ఆదికాలము నాబ్ర హాము శారా లెంతో నీ దయలో బ్రతికి యిల నెగడినట్టు ఈ దీన దంపతులు గాదిలిచే బ్రతుకుటకు నీ దయారసమొస గు మక్షయుండా ||మంగళము క్రీస్తునకు||
సంతానము గాంచి సద్భక్తిలో బుద్ధి మంతులై క్రైస్తవ మతము నందు అంత్యపర్యంతంబు నణుఁకువగఁ బెంచ నా ద్యంత రహితుండ స హాయ మిమ్ము ||మంగళము క్రీస్తునకు||
కర్తయైన క్రీస్తు కరుణయు దేవుని పరమపూర్ణ ప్రేమ ప్రబలము గను సురుచిరం బగు పరి శుద్ధాత్ము నైక్యత కలుగుఁగాక దంప తుల కనిశము ||మంగళము క్రీస్తునకు||