దేవర నీ దేవెనలు ధారళముగను

deevara nee deevenalu dhaaralamuganu

🎵 AKK-564💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

దేవర నీ దేవెనలు ధారళముగను వీరలపై బాగుగ వేగమె దిగనిమ్ము పావన యేసుని ద్వారగను ||దేవర నీ||

1వ చరణం

దంపతులు దండిగ నీ ధాత్రిలో వెలయుచు సంపదలన్ సొంపుగ నింపుగ పెంపగుచు స హింపున వీరు సుఖించుటకై ||దేవర నీ||

2వ చరణం

ఈ కవను నీ కరుణన్ ఆకరువరకును లోకములో శోకము లేకయె యేకముగాఁ బ్రాకటముగను జేకొనుము ||దేవర నీ||

3వ చరణం

ఇప్పగిది నెప్పుడును గొప్పగు ప్రేమతో నొప్పుచు దా మొప్పిన చొప్పునఁ దప్పకను మెప్పుగ బ్రతుకగఁ బంపు కృపన్ ||దేవర నీ||

4వ చరణం

తాపములు పాపములు మోపుగ వీరిపై రాకుండగాఁ గాపుగఁ బ్రాపుగ దాపునుండి యాపద లన్నియుఁ బాపుచును ||దేవర నీ||

5వ చరణం

సాధులుగన్ జేయుటకై శోధనలచే నీవు శోధింపగాఁ కదలక వదలక ముదమున నీ పాదము దాపునఁ బాదుకొనన్ ||దేవర నీ||

6వ చరణం

మెండుగ భూమండలపు గండములలో వీరుండగను తండ్రిగ దండిగ నండనుండి వెండియు వానిని ఖండించవే ||దేవర నీ||

7వ చరణం

ఇద్దర వీరిద్దరును శుద్ధులై నిన్ను సేవించుటకై శ్రద్ధతో బుద్ధిగ సిద్ధ పడన్ దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్ ||దేవర నీ||

8వ చరణం

వాసిగ నీ దాసులము చేసిన యీ మొఱల్ దీసికొని మా సకలేశ్వర నీ సుతుఁడౌ యేసుని పేరిటఁ బ్రోవు మామేన్ ||దేవర నీ||

Report Error