ఏదేన్ వనంబునందు ఆది వివాహమున్

eedeen vananbunandu aadi vivaahamun

🎵 AKK-566💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఏదేన్ వనంబునందు ఆది వివాహమున్ విధించినట్టి వాక్కు వర్థిల్లు నిప్పుడున్.

1వ చరణం

పవిత్ర కల్యాణంబున్ పదిలపర్చుచు దైవ త్రిత్వంబు నేఁడున్ దీవింప వత్తురు.

2వ చరణం

సంతాన వరమును సంతోష ప్రేమయు వింతైన యైక్యత్వంబు నెంతయు నిత్తురు.

3వ చరణం

ఆదామునకుఁ దండ్రీ, హవ్వ నొ సంగితి వాదరముగ నీమె నీ ధన్యున కిమ్ము

4వ చరణం

నీ ఱెక్క క్రింద వీరిఁ బరిగ్రహించుచు వైరి తంత్రంబునుండి దూరంబుఁ జేయుము.

5వ చరణం

ఈ రీతిన్ బ్రత్కి యంత క్రీస్తేసు పెండ్లికి వీరిద్దరును జేరి బరంగఁ జేయుమి.

Report Error