దశము భాగము లెల్ల దేవునివి
dashamu bhaagamu lella deevunivi
దశము భాగము లెల్ల దేవునివి ధారాళముగ నియ్య సమకూడుఁడి పశువులు పైరులు దేవునివి పసిఁడి లోహపుగనులు దేవునివి భాగ్యభోగ్యము లెల్ల దేవునివి భావించి కానుకలను నియ్యుఁడి ||దశము భాగము||
దేవునివి దొంగలించెదరా దేవదేవుని మోసపుచ్చెదరా భావించి మది నెంచి భయము నెంచి ప్రార్ధింపఁ దలవంచి ప్రభు భాగమున్ దేవాలయంబును పూర్ణంబుగా దేదీప్యముగా నుండ సమకూర్చుఁడీ ||దశము భాగము||
పరిశుద్ధ దేవుని మందిరముఁ పరిపూర్ణముగాను యోచించుఁడీ పరిశుద్ధ భాగము విడఁదీయుఁడీ పాడిపంటలు నాస్తి దేవునిని పదియవ భాగంబు దేవునివి పరమాత్మ దీవెనలను బొందుఁడీ ||దశము భాగము||
ప్రథమ ఫలంబులు దేవునివి విదితంబుగా నీయ మది నెంచుఁడీ సదమల హృదయములను బొందియుఁ ప్రథమ భాగము నెల్ల విడఁదీసియు ముదమున దేవునికర్పించుఁడీ సదయు దీవెనలొంద సమకూర్చుఁడీ ||దశము భాగము||
ఆకసపు వాకిండ్ల విప్పుదును అధిక కృపలను గుమ్మరించుదును మీ కష్టఫలములను దీవింతును భీకర నాశంబుఁ దొలఁగింతును మీ కానంద దేశ మిత్తు నని శ్రీకరుం డెహోవా సెల విచ్చెను ||దశము భాగము||
దినభోజనం బిచ్చు దేవునిని ఘన సౌఖ్యముల నిచ్చు దేవునిని వినయంబుతో మదిని ధ్యానించుచు దినభోజనంబులను భాగించుచు మానక దేవుని కర్పించు డీ ఘనసేవ జయమొందు పని బూనడీ ||దశము భాగము||