దాతృత్వమును గలిగి పెరుగుదమ ధనము

daatrutvamunu galigi perugudama dhanamu

🎵 AKK-573💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

దాతృత్వమును గలిగి పెరుగుదమ ధనము ధాత్రి దేవుని దంచు నెఱు గుదమ ||దాతృత్వమును గలిగి||

1వ చరణం

శక్తికొలఁది కాన్కలర్పింతమ మన భుక్తినుండి కొంతఁ దీయుదమ ||దాతృత్వమును గలిగి||

2వ చరణం

సంతోషముగ నియ్య సాగుదమ మన స్సంతటితోఁ జేయ నేగు దమ ||దాతృత్వమును గలిగి||

3వ చరణం

గర్వఘనములు వీడి యర్పింతమ యుర్వి సర్వ మాయనందు నేర్పింతమ ||దాతృత్వమును గలిగి||

4వ చరణం

సంఘ సేవకు సొమ్ము సమకూర్తమ క్రీస్తు సంఘ యక్కఱ లన్ని తీర్చుదమ ||దాతృత్వమును గలిగి||

5వ చరణం

ప్రతియాదివార మిది మది నుంతమ దీని ప్రతి సంఘస్థుఁడు చేయ బోధింతమ ||దాతృత్వమును గలిగి||

6వ చరణం

విధిఁ దలఁచి దుర్బలుల రక్షింతమ సంఘ విధవాళి దానముతో దర్శింతము ||దాతృత్వమును గలిగి||

7వ చరణం

దిక్కులేని జనుల దీవింతమ వారి యక్కఱలలో మేలుఁ గావింతమ ||దాతృత్వమును గలిగి||

8వ చరణం

పుచ్చుకొనుటకంటె నిచ్చుదమ మఱల నిచ్చు తండ్రికి స్తుతుల నిచ్చెదమ ||దాతృత్వమును గలిగి||

9వ చరణం

వెదజల్లి యభివృద్ది పొందుదమ మోక్ష పదవు లను భవింపఁ బరుగిడుదమ ||దాతృత్వమును గలిగి||

10వ చరణం

వర్ధిల్లిన కొలది చెల్లింతము లోక వ్యర్థ ఖర్చులనెల్ల మళ్లింతమ ||దాతృత్వమును గలిగి||

Report Error