ఇచ్చునట్టి విధము తెలియండి ప్రియులారా

ichchunatti vidhamu teliyandi priyulaaraa

🎵 AKK-574💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఇచ్చునట్టి విధము తెలియండి ప్రియులారా మీరు హెచ్చు పొందు విధము ఇది నుండి పుచ్చుకొనుట కన్న నెప్పు డిచ్చుటయే కడు ధన్యత యని హెచ్చరించి చెప్పలేదా యేసు ప్రభు వపొస్తలులకు ||ఇచ్చునట్టి విధము||

1వ చరణం

శక్తికొలఁది దాన మీయుండి సోదరులార భక్తికొలఁది పరుల కీయుఁ డి శక్తి లేదని సాకు చెప్పక సణగ కేమియు సరగ శ్రద్ధా సక్తితో పేదలకు నిచ్చుట యుక్త మని భావించి మదిలో ||ఇచ్చునట్టి విధము||

2వ చరణం

నీతిబోధలు చేయువారికి బోధకులైన నిఖల పాలకులైన వారికి ఆతురముతో నీయవలెనని యనుభవముగల మీరలెల్లరు చేతులార నీయు డయ్య ప్రీతి తోడును వారవార ||ఇచ్చునట్టి విధము||

3వ చరణం

ఆలయ కృత్యములు జరిగించు యాజకుఁ డెపుడు నాలయంబువలన జీవించు ప్రాలుమాలక పనిని జేయఁ బరఃగ మీ యర్పణలఁ గాన్కల బలవంతము లేక మీరు పలువిధంబు నియ్య వెదకుడి ||ఇచ్చునట్టి విధము||

Report Error