సంతోషముతో నిచ్చెడు వారిని నెంతో
santooshamutoo nichchedu vaarini nentoo
సంతోషముతో నిచ్చెడు వారిని నెంతో దేవుఁడు ప్రేమించున్ వింతగ వలసిన దంతయు నొసంగును వినయ మనసుగల విశ్వాసులకును ||సంతోషముతో నిచ్చెడు||
అత్యాసక్తితో నధికప్రేమతో నంధకార జను లందఱకు సత్య సువార్తను జాటించుటకై సతతము దిరిగెడు సద్భుక్తులకు ||సంతోషముతో నిచ్చెడు||
వేదవాక్యమును వేరు వేరు గ్రా మాదుల నుండెడు బాలురకు సాధులు ప్రభుని సు బోధలు నేర్పెడి సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు ||సంతోషముతో నిచ్చెడు||
దిక్కెవ్వరు లేకుండెడి దీనుల తక్కువ లన్నిటిఁ దీర్చుటకై నిక్కపు రక్షణ నిద్ధరలో నలు ప్రక్కలలోఁ బ్రక టించుట కొఱకై ||సంతోషముతో నిచ్చెడు||
ఇయ్యండీ మీ కీయం బడు నని యియ్యంగల ప్రభు యే సనెను ఇయ్యది మరువక మదిని నుంచుకొని యియ్యవలెను మన యీవుల నిఁకను ||సంతోషముతో నిచ్చెడు||
భక్తిగలిగి ప్రభు పని కిచ్చుట బహు యుక్త మటంచు ను దారతతో శక్తికొలఁది మన భుక్తి నుండి యా సక్తితో నిరతము నియ్య వలెను ||సంతోషముతో నిచ్చెడు||