పల్లవి
నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగము నీయ వెనుదీతువా ||నీ ధనము||
1వ చరణం
ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోక నాధుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా ||నీ ధనము||
2వ చరణం
పాడిపంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా వేడంగా ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ మో క్రైస్తవా ||నీ ధనము||
3వ చరణం
వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా! వెలిగించ ధరపైని ప్రభు కలిమికొలది ప్రభున కర్పింపవా ||నీ ధనము||
4వ చరణం
కలిగించె సకలంబు సమృద్ధిగా తొలగించె పలుబాధ భరితంబులు బలియాయె నీ పాపముల కేసువే చెలువంగ ప్రభుకీయ చింతింతువా ||నీ ధనము||