పల్లవి
ఏది సఖుడ యేది నీ మదిని జేసికొనిన ప్రతిన యేది నీవొసంగు కాను కిదియె తరుణమీయరమ్ము ||ఏది సఖుడ||
1వ చరణం
అన్న వస్త్రంబు లిచ్చి యాలు బిడ్డల ననుగ్రహించి యన్ని వస్తువుల నిచ్చి యున్న నా కెదురుకాను ||ఏది సఖుడ||
2వ చరణం
వ్యాధి బాధలొదినపుడు శోధనంబు లడరినపుడు ఏది యెప్పుడవసరం బది యొసంగి యాదిరించితి ||ఏది సఖుడ||
3వ చరణం
మనసు శాంతిలేక నీవు మదిని బొగలుచుండ జూచి కనని వినని ప్రేమ జూపి కనికరించినట్టి ప్రభుని ||ఏది సఖుడ||
4వ చరణం
పాపమందు పడినాడు దాపుజేరి నిలుపలేద? కాపరివలె నిన్ను గాచి యోపికతో నడుపలేద ||ఏది సఖుడ||
5వ చరణం
ఏమి దాచినావో సఖుడ! ఏమి తెచ్చినావు నేడు? నీ మనసు నిండ ప్రేమయున్న నదియే నాకు వేనవేలు ||ఏది సఖుడ||