మన దేశంబున క్రీస్తు సువార్త
mana deeshanbuna kreestu suvaarta
మన దేశంబున క్రీస్తు సువార్త వ్యాపించుటకు మార్గంబు స్త్రీలంచు మరువకమ్మ పనిబూని ప్రభుకొరకు పరదేశంబులయందు ఘనురాండ్రు చేయుపనుల్ వినలేదమ్మా? ||మన దేశంబున||
సాటియైనటువంటి సాయంబవై పతికి లోటులేకుండ నెపుడు లోబడు మమ్మ పాటుపడి నీ సుతుల భయభక్తితో పెంచి నాటుము మదిలోన బోధ నమ్ములమ్మ ||మన దేశంబున||
అన్నపానములందు నలవాటులందు నీ పన్యులకు మాదిది వగుదు వమ్మ నిన్ను నీ పనుల గమ నించి పరీక్షించు చున్నవారింట బైట నున్నారమ్మ ||మన దేశంబున||
ఘనుఁడౌ దేవుని వాక్య మును జదివియో వినియో దిన మేకాంతముగ ప్రార్థించు మమ్మ నినువలెను నీ పొరుగు నెలఁతుల ప్రేమింపవలె వినుమ దూషింపక దీ వించు మమ్మ ||మన దేశంబున||
పనులెన్నో నీ కున్న ప్రభు యేసు శుభవార్త దినమున కొక్కరికైన దెల్పుమమ్మ ఒనరంగా నేఁడాది కొక యాత్మనైన నిక నెనరుతో రక్షింప నేర్చుకొమ్మ ||మన దేశంబున||
ఎల్లసేవకుల కొర కెల్లప్పుడు ప్రార్థింప తల్లుల సమాజమునకు చెల్లు నమ్మ పల్లెలో శుభవార్త ప్రభవింపవలెనన్న తల్లులే మంచి సా ధనములమ్మ ||మన దేశంబున||