మనోవిలసితంబౌ దినంబు మహిమాన్వితంబు అనంతజగతీమనోహ
manoovilasitanbau dinanbu mahimaanvitanbu anantajagateemanooha
మనోవిలసితంబౌ దినంబు మహిమాన్వితంబు అనంతజగతీమనోహ రంబు ఘనాదిప్రభుయశః ప్రకాశంబు ||మనోవిలసితంబౌ దినంబు||
మందమారుతములందము నొసగగ డెందములకు నానందము నిడగా సుందర పక్షుల సుమధురగానము సుఖావహంబై శోభించెనుగా ||మనోవిలసితంబౌ దినంబు||
అరుణభాస్కరుని కిరణాకరము ధరదిక్తటముల దరిజేరెనుగా ధరా వలయమాఖర భానునిచే ధగద్ధగీయంబై వెల్గెనుగా ||మనోవిలసితంబౌ దినంబు||
పులుగిల కిలకిల కలరవములతో పొందుగ గలసిన భూరి రవంబు లలితమనోహరశ్రావ్యమ వినుమా తలపన్ దానికి కారణమేమో ||మనోవిలసితంబౌ దినంబు||
రయమున నొలీవ నగంబుగనుమా రభసయుక్తమగు జనమును గనుమా జయంజయంబను జయ ధ్యానంబులు వియదంతము జనమ్రోగుట వినుమా ||మనోవిలసితంబౌ దినంబు||
ప్రసన్నవదనుడు భానుతేజుడు అసంఖ్యజనగణ పరివృతబలుడు ప్రసితరాసభాసీనుడు యేసుడు అసమ శాంతితో నరుదెంచెనహో ||మనోవిలసితంబౌ దినంబు||
జయములు బాడెడు బాల చయముతో సాత్వికుడై రాసభంబు నెక్కి జయోత్సవంబుతో సర్వేశ్వరుడు చనిహృదయము సమర్పించె దము ||మనోవిలసితంబౌ దినంబు||