ధ్యానింప నే చిత్తమా వర్షాంతమున
dhyaaninpa nee chittamaa varshaantamuna
ధ్యానింప నే చిత్తమా వర్షాంతమున ధ్యానింపనే చిత్తమా ధ్యానించ వాసక్తి జ్ఞానంబుఁ గలిగించు జ్ఞాన స్వరూపుఁడు జ్ఞానాత్మచే నీకు ||ధ్యానింప నే||
అరయ నీ తలఁపుల నఘము లగుపడు నీకుఁ పరిశుద్ధుఁ డీక్షింప బహుగా గనుపడుచుండు ||ధ్యానింప నే||
పరికింపఁ బలుకులఁ పాప మగుపడు నీకు పరిశుద్ధుఁ డరయుఁ గ న్పడకుండు నే యది ||ధ్యానింప నే||
క్రియలను జింతింప మయిల గనపడు గాన భయ మొంది నమ్మికను బదవే క్రీస్తుని దరికి ||ధ్యానింప నే||
దేవుని ఘన ప్రేమ దినదినముఁ దలపోయ నీవు పొందఁగ వచ్చు నిక్కమైన శుద్ధి ||ధ్యానింప నే||
స్మరియింప నీలోన వర రక్షకుని పాట్లు భరియింప నోపుదువె పాప మొక నిమిషంబు ||ధ్యానింప నే||
హృదయంబు విమలాత్మ సదనంబుఁ గావింపఁ పదవే శ్రీఘ్రంబుగఁ పరమ జనకుని కడకు ||ధ్యానింప నే||
దేవుని సేవింపఁ దిరముగ నాశించి దేవాత్మ కొర కీవు దినము దేవుని వేఁడ ||ధ్యానింప నే||