ఘనదేవ ప్రియ తనయుండా జగద్రక్షా
ghanadeeva priya tanayundaa jagadrakshaa
ఘనదేవ ప్రియ తనయుండా జగద్రక్షా వినుతి జేతుము నీ మహిమన్ ఘనతరంబుగ గత సంవత్సర దినము లన్నిట మాకు నీభువి ఘనసుఖము లొనరించి మరి నూతనపు వత్సర మొసగినందుకు ||ఘనదేవ ప్రియ||
అధిక ప్రేమలొసఁగుము యేసు ప్రభు కుదురుగ నీ వత్సరము ప్రధమ దినమున మమ్ము నందరి ముదముతో నిచ్చటకుఁ జేర్చితి ప్రబలమగు సంగీతస్తుతులను మిగులబొందుము యేసు రక్షక ||ఘనదేవ ప్రియ||
అంచితముగ నిచ్చటన్ గూడిన సభలో స్త్రీలన్ బురుషుల బిడ్డలన్ మంచి మార్గమునుంచి నీ యత్యంత ప్రేమతోఁ గావు మిలను చంచలులు గాకుండ నీ కృప లుంచి మము రక్షించుమో ప్రభు ||ఘనదేవ ప్రియ||
దీవించు ప్రభుయేసువా సువార్తికులన్ సావధానముగా భువిలో భావమందున నీపదంబుల సేవ బాగుగఁ జేయుచున్ నీ జీవజల వాక్యంబులన్ ధర ధీరతనుఁ బ్రకటింపఁ జేయుము ||ఘనదేవ ప్రియ||
పరముండ ధర నీ సభలన్ నూతనముగ స్థిరపర్చి బలపర్చుము సరసముగ నాశీర్వచనము ల్విరివిగా నొసంగుచున్ నూ తన సహోదర ప్రియుల సమితిని మరియుఁ జేర్చుము నీ సభలలో ||ఘనదేవ ప్రియ||
కరుణాళ యీవత్సరము క్రైస్తవ బడుల ధరణిబ్రబలఁ జేయుమా సరిగ నుపాధ్యాయులందరి మరి మరీ దీవించు ప్రభువా స్థిరముగా పరమార్ధములు బా లురకు గరవుచునుండఁ జేయుము ||ఘనదేవ ప్రియ||
భాసురంబుగ పరలోక ప్రకాశుఁడా దాసబృందములన్ గావు వాసిగా నరలోకము నని వాసులగు మీ దాసులందరి దోషరాసిని ద్రోసి నీ కృప జూపుచును రక్షించు మనిశము ||ఘనదేవ ప్రియ||