కలుగుఁగాక దేవా కలుగుఁగాక కలుగుఁగాక
kalugungaaka deevaa kalugungaaka kalugungaaka
పల్లవి
కలుగుఁగాక దేవా కలుగుఁగాక కలుగుఁగాక మా కిలలో నిప్పుడు విలువ లేని దయ గల నీ దీవెన ||కలుగుఁగాక దేవా||
1వ చరణం
తనయుని కరుణయుఁ దండ్రి దేవు దయ తనరు నాత్మ కృప తప్పక మాకుఁ ||కలుగుఁగాక దేవా||
2వ చరణం
మనమున భక్తులు మరువక యైక్యము ఘనముగఁ బెంపఁగ ఘన సహాయము ||కలుగుఁగాక దేవా||
3వ చరణం
ఇట్టి యైక్యమును యేసునితో మరి గట్టిగఁ బెంచిన ఘన సౌఖ్యంబు ||కలుగుఁగాక దేవా||