పంపుము దేవా దీవెనలతోఁ పంపుము

panpumu deevaa deevenalatoon panpumu

🎵 AKK-614💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

పంపుము దేవా దీవెనలతోఁ పంపుము దేవా పంపుము దయ చేతఁ పతిత పావన నామ పెంపుగ నీ సేవఁ ప్రియమొప్ప నొనరింపఁ ||పంపుము దేవా||

1వ చరణం

మా సేవ నుండిన మా వెల్తు లన్నియు యేసుని కొఱకు నీ వెసఁగ క్షమియించుచుఁ ||పంపుము దేవా||

2వ చరణం

వినిన సత్యంబును విమలాత్మ మది నిల్పి దినదినము ఫలములు దివ్య ముగ ఫలియింపఁ ||పంపుము దేవా||

3వ చరణం

ఆసక్తితో ని న్ననిశము సేవింప భాసురంబగు నాత్మ వాసి కెక్కఁగ నిచ్చి ||పంపుము దేవా||

Report Error