ఆనంద యాత్ర ఇది ఆత్మీయ

aananda yaatra idi aatmeeya

🎵 AKK-630💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరుషలేము యాత్ర ||ఆనంద యాత్ర||

1వ చరణం

యేసుని రక్తము పాపముల నుండి విడిపించును వేయినోళ్ళతో స్తుతించినను తీర్చలేము ఆ రుణము ||ఆనంద యాత్ర||

2వ చరణం

రాత్రియు పగలును పాదములకు రాయి తగలకుండ మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగ ||ఆనంద యాత్ర||

3వ చరణం

కృతజ్ఞత లేనివారు వేలకొలదిగ కూలినను కృపా వాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృప పొందెదము ||ఆనంద యాత్ర||

4వ చరణం

ఆనందం ఆనందం యేసుని చూచె క్షణం ఆసన్నం ఆత్మానంద భరితులమై ఆగమనాకాంక్షతో సాగెదన్ ||ఆనంద యాత్ర||

Report Error