ఆహా..ఆ...అంత్యతీర్పు నందున ...యేసూ నీ

aahaa..aa...antyateerpu nanduna ...yeesoo nee

🎵 AKK-640💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఆహా..ఆ...అంత్యతీర్పు నందున ...యేసూ నీ రక్షకుడే మహాభయంకరమో ...సింహంబుగా నుండు

1వ చరణం

ఓ మానవుండ నీ గతి యేమౌనో తెలియునా యేమేమి చేయుచుంటివో తప్పించుకొందువా?.... ||ఆహా..ఆ...అంత్యతీర్పు నందున||

2వ చరణం

లోకాలు పుట్టినప్పటినుండి మృతులైన ఏ కులజుడైన నాటికి తెర్పులో నిలచును ||ఆహా..ఆ...అంత్యతీర్పు నందున||

3వ చరణం

మృతులైన ఘనులు హీనులు యేసయ్య యెదుటను ప్రతివారు నిలిచియుందురు బ్రతికిన రీతిగనే ||ఆహా..ఆ...అంత్యతీర్పు నందున||

4వ చరణం

గ్రంధాలు విప్పబడగ గ్రంధాలలో వారి గ్రంథంబు బట్టబయలై పొందుదురు తీర్పును ||ఆహా..ఆ...అంత్యతీర్పు నందున||

5వ చరణం

నరులెల్ల క్రియలచొప్పున మరి తీర్పు పొందుదురు మరణము మృతుల లోకము గురియౌను యగ్నికి ||ఆహా..ఆ...అంత్యతీర్పు నందున||

6వ చరణం

ఈనాడు నీవు కూడను యేసుని విడిచినచో ఆనాడు నీవు కూడాను అందుండి ఏడ్చెదవు ||ఆహా..ఆ...అంత్యతీర్పు నందున||

7వ చరణం

దేవుని జీవగ్రంథము దేవుడు తెరచును ఎవ్యాని పేరందుండదో వాడగ్నిలో బడును ||ఆహా..ఆ...అంత్యతీర్పు నందున||

Report Error