క్రైస్తవుండా కదిలిరావయ్యా కలుషాత్ములకు

kraistavundaa kadiliraavayyaa kalushaatmulaku

🎵 AKK-647💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

క్రైస్తవుండా కదిలిరావయ్యా కలుషాత్ములకు యీ సిలువశక్తి జాటవేమయ్యా యెండవానలనియు జడిసి ఎంతకాలము మూలనుందువు కండలను ప్రేమింతువేమన్నా ఈ మంటికండలు ఎంత బెంచిన మంటికేనన్నా ||క్రైస్తవుండా కదిలిరావయ్యా||

1వ చరణం

వసుధలో ప్రజలెల్లరు యేసు వాక్యంబు వివక్షుద్భాధకొని వాంఛించుచుండగను మిషనులెల్లను మిషలచేత మిట్టిపడుచు వాదములతో యేసు బోధను విడచినారన్నా నీవెంతకాలము వారిచెంత నుందువోరన్న ||క్రైస్తవుండా కదిలిరావయ్యా||

2వ చరణం

సత్యవాక్యము సంతలోదులిపి బోధకులు దొరల బత్యములపై భ్రాంతులు నిలిపి చిత్రమగు అనుకూల బోధలు చేసి బ్రజలను మోసగించు సూత్రధారుల జేర రాదయ్యా సుఖభోగమిడిచి సత్యవాక్యము చాట రావయ్యా ||క్రైస్తవుండా కదిలిరావయ్యా||

3వ చరణం

శక్తిహీనుడనందు వేమయ్యా సౌజన్యమగు శుద్ధాత్మశక్తిని పొందుకొనుమయ్యా భక్తిహీనత పారద్రోలు భ్రష్ట మనస్సు బయలుపరచు శక్తికలుగు సువార్త చాటుదువు సువార్త చేయ జయమొంది ఆత్మలను రక్షించెదవు ||క్రైస్తవుండా కదిలిరావయ్యా||

4వ చరణం

నీతికై భక్తాదిపరులెల్ల నిజవిశ్వాసము నిలుపుకొన పోరాడిరే చాలకత్తిపోటులు రాళ్ళదెబ్బలు కరకు గల రంపములు కోతలు బెత్తములు కొరడాల దెబ్బలు పైబడి చీలి దేహము వాలలాడెను రక్తము భువిపై ||క్రైస్తవుండా కదిలిరావయ్యా||

5వ చరణం

ఆది సంఘము నార్పుటకు నెంచి ఆ దుష్ట నీరో అధిపతి చెలరేగి గర్వించి ఆదిక్రైస్తవ భక్తుల స్థంభముల గట్టి తారుపూసి అగ్నిని ముట్టించి కాల్వంగ ఆ సంఘ మెచ్చె అధిపతి అప్పుడె నశియించె ||క్రైస్తవుండా కదిలిరావయ్యా||

6వ చరణం

దూతలకు లేనట్టి పరిచర్య ఓ ప్రియ సఖుండా ఖ్యాతిగా నీ కిచ్చె గ్రంథంబు భీతియేల తినుము గ్రంథము తేనెవలె మధురముగ నుండున జ్ఞానము నీకబ్బునో హితుడ జ్ఞానంబునొంది స్వామిని సేవించుమో సఖుండా ||క్రైస్తవుండా కదిలిరావయ్యా||

Report Error