పల్లవి
గీతం గీతం జయ జయగీతం చేయితట్టి పాడెదము
1వ చరణం
చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను అందు వేసిన ముద్ర కావలినిల్చెను నా దైవ సుతుని ముందు ||గీతం గీతం||
2వ చరణం
వలదు వలదు యేడువవలదు వెళ్ళుడి గలిలయకు తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి ||గీతం గీతం||
3వ చరణం
అన్న కయపవారల సభయు అదరుచు పరుగిడిరి ఇంక భూతగణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి ||గీతం గీతం||
4వ చరణం
గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి జయవీరుడు రాగా మీ వేళతాళ వాద్యముల్ బూరలెత్తి ధ్వనించుడి ||గీతం గీతం||