ప్రభు యేసుని వదనములో నా
prabhu yeesuni vadanamuloo naa
పల్లవి
ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో పరికించిన శుభదినము గమనించిన యాక్షణము పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం
1వ చరణం
దిశలన్నియు తిరిగితిని నాపాపపు దాహముతో దౌష్ట్యములో మసలుచును దౌర్జన్యము చేయుచును ధన పీడనతో మృగ వాంఛలతో దిగజారితి చావునకు
2వ చరణం
యేసు నీరాజ్యములో భువి కేతెంచెడి రోజు ఈ పాపిని క్షమియించి జ్ఞాపకముతో బ్రోవుమని ఇల వేడితిని విలపించుచును ఈడేరును నా వినతి ||ప్రభు యేసుని||
3వ చరణం
పరదైనున ఈ దినమే నా ఆనందముతోను పాల్గొందువు నీవనుచు వాగ్ధానము చేయగానే(2) పరలోకమె నా తుది వూపిరిగా పయనించితి ప్రభుకడకు ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించె ||ప్రభు యేసుని||