పల్లవి
ప్రభువా! నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను నరులేమి జేయగలరు భయమేమిలేదు నాకు
1వ చరణం
గర్విష్టులైనవారు నాతో పోరాడుచుండ ప్రతిమాట కెల్లవారు పరభావ మెంచుచుండ ప్రభువా నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభువా! నే||
2వ చరణం
నేనెందుపోదుమన్నా గమనించుచుండువారు నా వెంట పొంచియుండి నన్ను కృంగదీయ నెంచ ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభువా! నే||
3వ చరణం
పగబూని వారు నన్ను హతమార్చ జూచియున్న మరణంబునుండి నన్ను కడువింత రీతిగాను ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభువా! నే||
4వ చరణం
జీవంపు వెల్గునైన నీ సన్నిధానమందు నే సంచరించునట్లు నే జారిపోకుండ ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభువా! నే||
5వ చరణం
నన్నాదుకొంటి నీవు నన్నాదరించినావు కొన్నావు నీవు నన్ను మన్నించినావు నీవు ఎన్నాళ్ళు బ్రతికి యున్న నిన్నే సేవింతు దేవా!