మధురం మధురం మధురం యేసునాధ

madhuran madhuran madhuran yeesunaadha

🎵 AKK-680💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

మధురం మధురం మధురం యేసునాధ కథ మధురం ||మధురం మధురం||

1వ చరణం

మధురమే మన ప్రభు యేసుని నామం మానవాళికదే మాధుర్యమనామం పాపిని బ్రోచెడి పావన నామం పరమున జేర్చే పరిశుద్ధనామం ||మధురం మధురం||

2వ చరణం

మారని దేవుని మాటయే మధురం మదిలోదలచిన కలతను దీర్చున్ ఎదలో బాధను బాపున్ నిరతం నమ్మిననరులకు నెమ్మది నిచ్చున్ ||మధురం మధురం||

3వ చరణం

పగలురేయి ప్రార్థించుటే మధురం పరిశుద్ధుల సహవాసమే మధురం అపోస్తలుల సద్భోదయే మదురం మధురాతి మధురం పరిశుద్ధ రుధిరం ||మధురం మధురం||

4వ చరణం

జుంటితేనెయ ధారలకంటే కమ్మనిది ప్రభు క్రీస్తుని వార్యం ఆదియందు ఆ వాక్యమే ఉండెన్ వాక్యమే ప్రియప్రభు యేసుగ మారెన్ ||మధురం మధురం||

5వ చరణం

అందరిలో అతిసుందరుడతడు ఆది దేవుని ఏకైక సుతుడు ఆశ్చర్యకరుడా ఆలోచన కర్త అవతరించె భువిన్ అందరి కొరకే ||మధురం మధురం||

6వ చరణం

యేసే క్రీస్తుగ నెరిగిన మేము పరుగిడితిమి పాపము నుండి దూరం పొందితిమి ఆత్మానందభాగ్యం ప్రకటించుటే మా ప్రధానధ్యేయం ||మధురం మధురం||

Report Error