రమ్మనుచున్నా డేసురాజు రండి సర్వ
rammanuchunnaa deesuraaju randi sarva
పల్లవి
రమ్మనుచున్నా డేసురాజు రండి సర్వ జనులారా
1వ చరణం
ఇల్లువాకిలి లేనివారలు ఇహాన నమ్మదగనివారలు తన రాజ్యము మీకిచ్చును యేసు
2వ చరణం
కరవుచే కృశించుచున్న మరణించుచున్న ప్రజలారా ఆకలిదప్పులు తీర్చును మీకు రండి సర్వజనులారా ||రమ్మనుచున్నా డేసురాజు||
3వ చరణం
ముండ్ల మకుటము ప్రక్కన గాయము పాదహస్తములలో గాయములు పొందిన ప్రభువే పిల్చెను మిమ్ము రండి సర్వజనులారా ||రమ్మనుచున్నా డేసురాజు||
4వ చరణం
రయమున ప్రియులారా కూడి రండి పరీక్ష చేయండి భరించును మీ భారములన్నియు రండి సర్వజనులారా ||రమ్మనుచున్నా డేసురాజు||