రమ్ము! నీ తరుణమిదే పిలచుచున్నాడు

rammu! nee tarunamidee pilachuchunnaadu

🎵 AKK-684💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

రమ్ము! నీ తరుణమిదే పిలచుచున్నాడు నీ ప్రభువైన యేసు నొద్దకు

1వ చరణం

జీవితమంతయు వ్యర్థముగను దుఃఖముతోను గడుపుటయేల వచ్చి ఆయన శరణు జొచ్చినచో వాంఛతో నిన్ను స్వీకరించున్ ||రమ్ము! నీ||

2వ చరణం

కట్టిన యిల్లు ధనధాన్యములు కనబడు బంధుమిత్రులును గూడు విడిచి నీవు పోయినచో వెంటనీతో రారెవరు ||రమ్ము! నీ||

3వ చరణం

అందము మాయ అస్థిరమే దాని నమ్మకుము మోసగించును మరణము ఒకనాడు వచ్చును మరువకు నీ ప్రభువును ||రమ్ము! నీ||

4వ చరణం

మిన్ను క్రిందన్ భూమి మీదన్ మిత్రుడేసు నామముగాక రక్షణ పొందు దారిలేదు రక్షకుడేసే మార్గము ||రమ్ము! నీ||

5వ చరణం

తీరని పాపవ్యాధులను మారని నీదు బలహీనతల్ ఘోర సిలువలో మోసితీర్చెన్ గాయములచే బాగుపడన్ ||రమ్ము! నీ||

6వ చరణం

సత్యవాక్కును నమ్మి రమ్ము నిత్యజీవమును నీకిచ్చున్ నీ పేరు జీవపుస్తకమునందు నిజముగ ఈనాడే వ్రాయున్ ||రమ్ము! నీ||

Report Error