అలల పైనే నడచినా నాదు యేసయ్యా- ఆదు కోవయ్యా

alala painee naddachinaa naadu yeesayyaa- aadu koovayyaa

🎵 TG-1002💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

గలిబిలిని నా కలవరములను - తొలగచేసిన కలుషహరుడా (2) నాదు యేసయ్యా... ఆదు కోవయ్యా... నాదు యేసయ్యా

1వ చరణం

శుద్ధుడా నీ పిలుపు వింటిని - అద్దరికి నే పయన మైతిని (2) ప్రొద్దుపోయెను భయము లాయెను - ఉద్ధరించగ స్వామి రావా "ఆదు "

2వ చరణం

నట్టనడి సంద్రాన రేగెను- అట్టహాసపు పెనుతుఫాను (2) గట్టుచూడగా చాల దూరము - ఇట్టి శ్రమలలో చిక్కు కొంటిని "ఆదు "

3వ చరణం

అలలు నాపై విసరి కొట్టగా - నావ నిండుగా నీరు చేరెను (2) బ్రతుకులెంతో భారమాయెను - రేవు చేరే దారి లేదా "ఆదు "

4వ చరణం

మాట మాత్రపు సెలవు చేత - సూటిగా అద్భుతములెన్నో (2) చాల చేసిన శక్తి మంతుడా - జాలి చూపి మమ్ము బ్రోవుమా "ఆదు "

5వ చరణం

చిన్న జీవిత నావ నాది - నిన్నేగురిగా పయనమైతిని ఎన్నోశోధన లెన్నో భయములు - కన్నతండ్రి కానరావా "ఆదు "

Report Error