అనంత జ్ఞాని నీకు అల్పుడను నాకు సహవాసమా

ananta jnyaani niiku alpuddanu naaku sahavaasamaa

🎵 TG-1261💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

మహిమాన్విత నీకు మట్టినైన నాకు స్నేహమా కృప ఇది నీ కృప కేవలం నీ కృప కృపా ... కృపా ... కృపా .... కృపా ||అనంత||

1వ చరణం

కోట్లాది జనులలో గుర్తించావు కోరుకొని కొమరునిగా లెక్కించావు క్షమించే మనస్సు కలిగి ఫలించే జీవమిచ్చి పరలోక పౌరునిగ నను చేసావు. ||కృపా||

2వ చరణం

అప్పగించుకున్నాను నీ కృపకే నేను గొప్ప దేవుడ నీ సన్నిధిలో ఉన్నాను పిలిచిన వాడా నన్ను గెలచిన వాడా ప్రేమించి ప్రేరేపించి స్థిర పరచిన వాడా. ||కృపా||

Report Error