అవధులే లేనిది దివ్యమైన నీ
avadhulee leenidi divyamaina nee
🎵 TG-1381🌐 Telugu
పల్లవి
అవధులే లేనిది దివ్యమైన నీ కృప అనంతమైనది ఆశ్చర్యమైనది (2) యేసయ్యా నాపై నీవు చూపిన కృప అమూల్యమైనది వర్ణించలేనిది (2) ||అవధులే||
1వ చరణం
ఊహించలేని హృదయానందమును దుఃఖమునకు ప్రతిగా దయచేసినావు భారమెక్కువైనా తీరం కడుదూరమైనా నీపై ఆనుకొందును నేను గమ్యం చేరుకొందును సరిపోల్చలేని మధురమైన అనుభవం వింతైన నీ ప్రేమలో అనుభవింపజేశావు సౌందర్యమైన అతిపరిశుద్ధమైన నీ రూపము తలచుకొందును నేను నీ కోసమే వేచియుందును లెక్కించలేని అగ్ని శోధనలో ప్రయాసమునకు తగిన ఫలములిచ్చినావు వాడబారని కిరీటము నే పొందుటకు వెనుకున్నవి మరచి నేను లక్ష్యము వైపు సాగెద