బేత్లేహేం పురమున చిత్రంబు కలిగె

beethleeheem puramuna chithranbu kalige

🎵 TG-1349🌐 Telugu
పల్లవి

బేత్లేహేం పురమున చిత్రంబు కలిగె కర్తాది యేసు జన్మించినపుడు అంధకారంపు పృథివి వీధులలో మోదంపు మహిమ చోద్యంబుగానరే ఉదయంపు తారల్ ముదమున బాడే ఉదయించ యేసు ఈ పృథివిలోన ముదమును గలిగె మరి సమాధానం పదిలంబుతోడ పూజించ రండి ||బేత్లేహేం||

1వ చరణం

పరమును విడచి నరరూపమెత్తి అరుదెంచి యేసు పరమ వైద్యుండై నరుల దుఃఖములన్ తొలగించివేసి పరలోక శాంతి స్థిరపరచె ప్రభువు నీదు చిత్తమును నాదు హృదయమున ముదమున జేయ మదినెంతో యాశ నీదు పాలనము పరమందు వలెనె ఈ ధరణియందు జరుగంగ జూడ దేవుని సన్నిధి దీనత నుండ పావనయాత్మ పవిత్ర పరచున్ పావనుడేసు ప్రకాశమిచ్చి జీవంబు నొసగి జీవించు నెదలో గతించె రాత్రి ప్రకాశించె కాంతి వితానముగ వికసించె నెల్ల దూతల ధ్వనితో పతి యేసు క్రీస్తు అతి ప్రేమతోడ అరుదెంచె నోహో

Report Error