భజన చేయుచు భక్తపాలక ప్రస్తుతింతు

bhajana cheeyuchu bhakthapaalaka prasthuthinthu

🎵 TG-2186🌐 Telugu
పల్లవి

భజన చేయుచు భక్తపాలక ప్రస్తుతింతు నీ నామమును (2) వృజినములపై జయము నిచ్చిన విజయుడా నిను వేడుకొందు ||భజన||

1వ చరణం

దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు నరుల గావను పరమునుండి ధరకు నీవు వచ్చినావు పరుడ నైన నా కొరకు నీ ప్రాణము నర్పించినావు చెడినవాడ నైన నన్ను జేరదీసి ప్రోచినావు పడిన నాడు గోతి నుండి పైకి లేవనెత్తి నావు ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృప యేసయ్య నీకు ఇంతయని వర్ణింప నిలలో నెవనికిని సాధ్యంబు కాదు

Report Error