భయము లేదు - దిగులు లేదు - జీవిత యాత్రలో

bhayamu leedu - digulu leedu - jiivita yaatraloo

🎵 TG-1152💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

యేసు ప్రభువు - మనతోనుండ - భయము లేదుగా హల్లేలూయ - హల్లేలూయ (2) "భయము లేదు "

1వ చరణం

గాలి తుఫాను రేగి అలలు పొంగినా విశ్వాస నావ మునిగి కొట్టబడిన సముద్రము పొంగి - నురుగు కట్టిన యేసు ప్రభువు మనతోనుండ భయము లేదుగా "2"

2వ చరణం

వ్యాధి భాధలు నన్ను ముట్టినా అంతులేని వేదనా నాకు కల్గిన గర్జించు సింహము - ఎదురు వచ్చిన యేసు ప్రభువు మనతోనుండ భయము లేదుగా "2"

3వ చరణం

శత్రువున్‌ చూచి విస్మయమొందకు నీతో కూడా వచ్చువాడు నీదేవుడే నిన్ను విడువడెన్నడు ఎడబాయడు యేసు ప్రభువు మనతోనుండ భయము లేదుగా "2"

Report Error