భీకరుండౌ మా యెహోవా
bheekarundau maa yehoovaa
🎵 TG-1860🌐 Telugu
పల్లవి
భీకరుండౌ మా యెహోవా – పీఠ మెదుటన్ గూడరే ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే ||భీకరుండౌ||
1వ చరణం
మట్టితోనే మమ్ము నెల్ల – మానవులుగ సృజించెను ఇట్టి శక్తుండౌ ప్రభున్ మే-మెచ్చుగా మది నెంతుము || భీకరుండౌ ||
2వ చరణం
ఏరితోడు లేక మము స-ర్వేశ్వరుడు సృష్టించెను ధారుణిన్ దానొక్కడే మా – దైవమని పూజింతుము పుట్టగిట్టన్ జేయ దానై – నట్టి దేవుని శక్తిని బట్టుగా లోకస్తులారా – ప్రస్తుతింపరే భక్తిని మేటి సంగీతంబులపై – మింట నారవ మొందను జాటరే వేవేల నోళ్ళన్ – సన్నుతుల్ ప్రభు వందను మిక్కిలి కష్టంబులతో – మిత్తికిని బాల్పొందను దిక్కు లేని గొర్రెలట్లు – దిరుగ జేర్పన్ మందను