భూనివాసులకు - ఈ లోక నివాసులకు
bhuunivaasulaku - ii looka nivaasulaku
పల్లవి
యేసే జీవం - యేసే సత్యం - యేసే మార్గమనీ సూటిగ ప్రకటించు
1వ చరణం
పరిసరములలోని - పండిన పైరంతా రాలిపోవు చుండ - సంతాపమే లేదా కన్నెత్తిచూడు - కన్నీరు కార్చు ఓ దైవ సేవకుడా - ఇకనైనా మేల్కొనవా "భూనివా"
2వ చరణం
పరమాత్మ ఆజ్ఞగని - ఆ యాత్మ స్వరమువిని పౌలువంటి భక్తులు - ప్రాణాలు తెగియించిరి దేవుని వాక్యము - దేదీప్యమానము దీనుడవై యెపుడు - దీక్షతో చాటించు "భూనివా"
3వ చరణం
సువార్త భారమును - సంపూర్ణ భాద్యతతో మోయాలి భోధకులు - చేరాలి గ మ్యాలు దేవుని మార్గము - పూజనీయము దివ్వెగ జీవించు - ధర్మము నెరవేర్చు "భూనివా"
4వ చరణం
సంఘమ మేల్కొనుమా - సాతానునెదిరించుమా సర్వాంగ కవచమును - ధరియించి పోరాడుము చీకటి త్రోవలో - సువార్త జ్యోతివై జ్వాలను రగిలించు - రక్షణ ప్రకటించు "భూనివా"