చాలునయ్యా చాలునయ్యా నీ కృప

chaalunayyaa chaalunayyaa nee krupa

🎵 TG-2690🌐 Telugu
పల్లవి

చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా (2) ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు తల్లిగ లాలించి తండ్రిగ ప్రేమించే ప్రేమా కరుణా నీ కృప చాలు (2)          ||చాలునయ్యా||

1వ చరణం

జిగటగల ఊభిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా హిమము కంటెను తెల్లగ మార్చయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మేస్సీయా నా జీవితమంతా అర్పింతు నీకయ్యా (2)      ||చాలునయ్యా||

2వ చరణం

బంధువులు స్నేహితులు త్రోసేసినా తల్లిదండ్రులే నన్ను వెలివేసినా నన్ను నీవు విడువనే లేదయ్యా మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మెస్సీయ నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా (2)        ||చాలునయ్యా||

Report Error