చెప్పనా చెప్పనా యేసు నీ

cheppanaa cheppanaa yeesu nee

🎵 TG-2304🌐 Telugu
పల్లవి

చెప్పనా చెప్పనా  యేసు నీ ప్రేమను చూపనా చూపనా మార్చిన బ్రతుకును గుండెల్లో గుడి కట్టి యేసయ్యకివ్వనా ప్రాణమే పెట్టిన ఈ ప్రేమ మరుతునా (2)            ||చెప్పనా||

1వ చరణం

చీకటి రాత్రిలో చీరు దీపమైన లేక ఏ ఒడ్డుకు చేరుతానో తెలియని వేళ కంటినిండ కన్నీళ్ళతో బరువెక్కిన గుండెతో అయిపోయిందంతా అనుకున్నవేళ నా చేయి పట్టావు నా వెన్నుతట్టావు నేనున్నానని నన్ను నిలబెట్టావు ||చెప్పనా||

2వ చరణం

నిందలన్ని తొలగించి ఆనందము నాకిచ్చి బాధ కలుగు దేశమందు బలమిచ్చావు ఒంటరైన నన్ను చేర్చి పదివేలుగ నన్ను మార్చి అవమానము తొలగించి బలపరిచావు అంతులేని ప్రేమ చూపి హద్దులేని కృపనిచ్చి నీ చల్లని నీడలో నను దాచావు

Report Error