చిరు దివ్వెల వెలుగులతో నీ

chiru divvela velugulathoo nee

🎵 TG-1992🌐 Telugu
పల్లవి

చిరు దివ్వెల వెలుగులతో నీ దివ్య కాంతులతో నను బ్రోవ రావయ్యా కంటి పాపలా.. నను కాన రావయ్యా (2) యేసయ్యా.. యేసయ్యా.. నను కాన రావయ్యా ఆ లోయలో… క్రమ్మిన చీకటిలో ఈ ఇలలో… నిరాశల వెల్లువలో దహించివేస్తున్న అవమానము కరువైపోయిన సమాధానము పగిలిన హృదయము కన్నీటి ధారల సంద్రము ఎగసి పడుతున్న కెరటము కానరాని గమ్యము (2)         ||చిరు||

1వ చరణం

ఏకమైన ఈ లోకము వేధిస్తున్న విరోధము దూరమవుతున్న బంధము తాళలేను ఈ నరకము ఈదలేని ప్రవాహము చేరువైన అగాధము (4)           ||చిరు||

Report Error