చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు

chuuchuchunna deevuddavayyaa nannu chuuchinaavu

🎵 TG-1292💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

నీ పేరేమిటో ఎరుగనయ్యా నా పేరుతో నన్ను పిలిచావయ్యా

1వ చరణం

శారాయి మాటలే విన్నాను అబ్రాముకే భార్యనయ్యాను ఈ అరణ్య దారిలో ఒంటరినై దిక్కులేక తిరుగుతున్న హాగరును నేను హాగరును ||చూచుచున్న||

2వ చరణం

ఇష్మాయేలుకు తల్లినైతిని అయినవారితో త్రోసివేయబడితిని కన్నకొడుకు మరణమును చూడలేక తల్లడిల్లిపోతున్న తల్లిని నేను ||చూచుచున్న||

3వ చరణం

పసివాడి మొరను ఆలకించావు జీవజలములనిచ్చి బ్రతికించావు నీ సంతతిని దీవింతునని వాగ్దానమిచ్చిన దేవుడవు నీవు గొప్ప దేవుడవు ||చూచుచున్న||

Report Error