చూడరే సిలువను వ్రే-లాడు యేసయ్యను

chuudaree siluvanu vree-laadu yeesayyanu

🎵 TG-2212🌐 Telugu
పల్లవి

చూడరే సిలువను వ్రే-లాడు యేసయ్యను పాడు లోకంబునకై – గోడు జెందె గదా ||చూడరే||

1వ చరణం

నా చేతులు చేసినట్టు – దోషంబులే గదా నా రాజు చేతులలో ఘోరంపు జీలలు దురితంపు దలఁపులే – పరమ గురిని శిరముపై నెనరు లేక మొత్తెనయ్యొ – ముండ్ల కిరీటమై పరుగెత్తి పాదములు – చేసిన పాపంబులు పరమ రక్షకుని – పాదములలో మేకులు పాపేఛ్చ తోడ గూడు – నాడు చెడ్డ పడకలే పరమ గురుని ప్రక్కలోని – బల్లెంపు పోటులు

Report Error