దేవా నీ సన్నిధిలో నిలచి

deevaa nee sannidhiloo nilachi

🎵 TG-1551🌐 Telugu
పల్లవి

దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము – (2) ||దేవా||

1వ చరణం

అపరాధులగు నీదు ప్రజల నెపములన్నియు బాపి కృపాళుండగు యేసు ప్రభువా కృపను జూపి రక్షించుమయా చేసి యున్నాము నేరములెన్నో చేసిన మేలులను మరచి మోసములలో బడియున్నాము యేసుప్రభు జయమునిమ్ము లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు నీ కట్టడలను మరచితిమి కట్టుము మమ్ము నీ వాక్యముచే నిస్వార్థులగు నీ దాసులను విశ్వాస ప్రమాణికులన్ శాశ్వతమైన ప్రేమతో నింపు విశ్వాసులు స్థిరపడి నడువ సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు

Report Error